తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం తిరుమలకు వెళ్లారు. ఉదయం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని కోరినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నపూర్ణ లాంటివని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలు నీరు, విద్యుత్ విషయాల్లో సహకరించుకోవాలని ఆయన ఆశించారు. బుధవారం మంత్రి తలసాని కుటుంబ సమేతంగా తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే నిర్వహించే నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి తలసానికి వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. తర్వాత టీటీడీ ఆలయ అధికారులు మంత్రికి స్వామివారి పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరినట్లు చెప్పారు. జగన్ పాలనపై కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజా పరిపాలన అందించే మంచి నాయకుడిని ఎన్నుకున్నారని ప్రశంసించారు. ఏపీలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సుస్థిర పరచుకోవడానికి మరో 6 నెలల సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు కలసి ముందుకు వెళ్తున్నారని తెలిపారు. రెండు రాష్ట్రాలు పాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. .
తెలుగు రాష్ట్రాలు అన్నపూర్ణ లాంటివి: తలసాని