ముఫ్పై రోజుల ప్రణాళికలో అటవీ శాఖ పాత్రే అత్యంత కీలకం అన్నారు

ముఫ్పై రోజుల ప్రణాళికలో భాగంగా హరిత గ్రామాల సాధన, తద్వారా రాష్ట్ర అభివృద్దిలో అటవీ శాఖ పాత్రే అత్యంత కీలకం అన్నారు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అటవీ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యత, శాఖలో పనిచేస్తున్న  ప్రతీ ఒక్కరి ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేస్తుందని, అటవీ శాఖలో పనిచేస్తున్న అందరికీ అత్యధిక ఉద్యోగ సంతృప్తి (Job satisfaction) కలుగుతుందన్నారు.